: రాష్ట్రపతి వద్ద క్యూ కట్టనున్న చిరంజీవి, కేవీపీ, రఘువీరా
తనను కలిసేందుకు వస్తున్న నేతలు, అధికారులతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన్ను కలవనున్నారు. ఈ మేరకు అపాయింటుమెంటు ఖరారైనట్టు రాష్ట్రపతి భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. కేంద్ర మాజీ మంత్రులు చిరంజీవి, జేడీ శీలంలతో పాటు సుబ్బరామిరెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, రామచంద్రయ్య తదితరులు ప్రణబ్ ను కలవనున్నట్టు సమాచారం. ఓటుకు నోటు కేసు నుంచి ఏపీకి ప్రత్యేక హోదా, ఉమ్మడి రాజధానిలో సెక్షన్-8 అమలు తదితర అంశాలపై వీరి మధ్య చర్చలు జరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.