: లోక్ సభ స్పీకర్ ను కలిసిన కవిత... బతుకమ్మ చిహ్నం బహూకరణ
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ హైదరాబాదు వచ్చారు. వివేకవర్ధిని విద్యాసంస్థల వార్షికోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాదు వచ్చిన ఆమెను రాజ్ భవన్ లో కొద్దిసేపటి క్రితం నిజామాబాదు ఎంపీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కలిశారు. ఈ సందర్భంగా ఆమె బతుకమ్మ చిహ్నాన్ని సుమిత్రా మహాజన్ కు బహూకరించారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలపైనా ఇరువురు మహిళా నేతలు చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. మహాజన్ తో పాటు వివేకవర్ధిని విద్యా సంస్థల వార్షికోత్సవానికి కవిత కూడా హాజరుకానున్నారు.