: హైదరాబాదులో మంటల్లో చిక్కుకున్న ఉప్పల్-మెహిదీపట్నం బస్సు


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఉదయం ఉప్పల్ నుంచి మెహిదీపట్నం వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం నారాయణగూడ సమీపంలోని బర్కత్ పురా కూడలి వద్ద జరిగింది. తక్షణం స్పందించిన డ్రైవర్ బస్సును పక్కన ఆపి ప్రయాణికులను దించివేయడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక దళ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. బస్సులో మంటలు ఎందుకు అంటుకున్నాయన్న విషయమై సమాచారం ఇంకా అందలేదు.

  • Loading...

More Telugu News