: విచారించాల్సింది చాలా ఉందట... సండ్ర రిమాండ్ కు ఏసీబీ సన్నాహాలు


ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసినట్లే కనిపిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి, మరో ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయ సింహలు నెల రోజుల పాటు రిమాండులో వుండి, బెయిలు తెచ్చుకున్నారు. అయితే నిన్న తమ ముందు విచారణకు హాజరైన టీడీపీ నేత, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు, మరికాసేపట్లో ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. అంతేకాక కేసులో విచారించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, సండ్రను తమ రిమాండ్ కు అప్పగించాలని ఏసీబీ అధికారులు కోర్టులో పిటీషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కోర్టులో దాఖలు చేయనున్న పిటీషన్ ను ఇప్పటికే ఏసీబీ న్యాయవాదులు సిద్ధం చేసినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News