: ఐదుగురు ఎమ్మెల్యేలతో సండ్ర 32 సార్లు మాట్లాడారు...ఆధారాలున్నాయంటున్న ఏసీబీ


ఓటుకు నోటు కేసులో అరెస్టైన టీడీపీ నేత, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు సంబంధించి ఏసీబీ అధికారులు పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు. కేసులో ప్రత్యక్ష ప్రమేయమున్న కారణంగానే సండ్రను అరెస్ట్ చేశామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలతో సండ్ర వెంకటవీరయ్య ఏకంగా 32 సార్లు ఫోన్ లో మాట్లాడారని వారు చెబుతున్నారు. ఈ విషయంలో పక్కా ఆధారాలతోనే సండ్రను అరెస్ట్ చేశామని కూడా ఏసీబీ వాదిస్తోంది. అయితే రాత్రి పొద్దుపోయేదాకా ఈ విషయాన్ని అధికారికంగా ఎందుకు ధ్రువీకరించలేదన్న విషయంపై మాత్రం ఏసీబీ అధికారులు నోరు విప్పకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News