: ఇంకా ఆస్పత్రిలోనే భూమా నాగిరెడ్డి... నేడు జగన్ పరామర్శ


వైసీపీ సీనియర్ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన భూమాను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తీవ్ర అనారోగ్యానికి గురైన భూమాను నంద్యాల జైలు అధికారులు కర్నూలు సర్వజన ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా ఆయన కర్నూలు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు కర్నూలు రానున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భూమాను పరామర్శించనున్నారు.

  • Loading...

More Telugu News