: రాత్రంతా ఏసీబీ కార్యాలయంలోనే సండ్ర... నేడు కోర్టుకు తరలించనున్న టీ ఏసీబీ


ఓటుకు నోటు కేసులో అరెస్టైన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నిన్న రాత్రంతా ఏసీబీ కార్యాలయంలోనే గడిపారు. నిన్న ఉదయం తమ ఎదుట విచారణకు హాజరైన ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు కోర్టు సమయం ముగిసిన తర్వాత ఏసీబీ అధికారులు ప్రకటించారు. అంతేకాక న్యాయమూర్తుల అధికారిక నివాసాల్లో జడ్జిల ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నా, ఆ దిశగా చర్యలు చేపట్టని ఏసీబీ అధికారులు సండ్రను రాత్రంతా తమ అదుపులోనే ఉంచుకున్నారు. కాసేపట్లో సండ్రను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. రాత్రి తమ అదుపులో ఉన్న సండ్ర వెంకటవీరయ్యను ఏసీబీ అధికారులు ఏ విధంగా ట్రీట్ చేశారన్న అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News