: పొరపాటు జరిగింది... సొంత రాజధానిపైనే బాంబేసిన ఇరాక్ యుద్ధవిమానం!
సొంత రాజధానిపైనే ఇరాక్ యుద్ధ విమానం బాంబు వేసిన ఘటన చోటు చేసుకుంది. ఇరాక్ లో తీవ్రవాదులపై పోరు జరుపుతున్న యుద్ధ విమానం సుఖోయ్ ఎన్ యూ-25 పొరపాటున జనావాసాలపై బాంబు జారవిడిచింది. యుద్ధ ప్రదేశం నుంచి రషీద్ ఎయిర్ బేస్ కు తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాజధాని బాగ్ధాద్ లోని జడిదా ప్రాంతంలోని నివాస గృహాలపై బాంబును జారవిడిచింది. సాంకేతిక లోపం కారణంగా ఈ బాంబు జారిపడిందని అధికారులు తెలిపారు. కాగా, ఈ బాంబు పేలుడులో ఏడుగురు మృతి చెందగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.