: మన ర్యాంకు పదిలం... ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ జాబితా విడుదల
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు క్రికెట్ కు సంబంధించి తాజా ర్యాంకుల జాబితా విడుదల చేసింది. టీమ్ విభాగంలో భారత జట్టు తన నాలుగో స్థానాన్ని నిలుపుకుంది. ఇంగ్లాండ్ ఐదోస్థానంలో ఉండగా, పాకిస్థాన్ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా టాప్ చెయిర్ లో ఉండగా, రెండు, మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ సిరీస్ జరగనుండడంతో ర్యాంకుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ గనుక సిరీస్ ను 3-0తో నెగ్గితే రెండో ర్యాంకుకు ఎగబాకుతుంది! అయితే, ఆసీస్ గనుక సిరీస్ లోని 5 మ్యాచ్ లలోనూ నెగ్గితే మాత్రం ఇంగ్లాండ్ ఏడోస్థానానికి పడిపోతుంది. ఇక, బ్యాటింగ్ జాబితా విషయానికొస్తే... విరాట్ కోహ్లీ ఒక్కడే భారత్ తరపున టాప్ -10 లో ఉన్నాడు. కోహ్లీకి పదో ర్యాంకు లభించింది.