: సోషల్ మీడియాను ఊపేస్తున్న తుంపాకుమారి


సోషల్ మీడియాలో ఏడేళ్ల చిన్నారి తన గాత్రంతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. జార్ఖాండ్ లోని బ్రిజ్ కిషోర్ అనే అంధుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న నిరుపేద బాలిక తుంపాకుమారిలో అద్భుతమైన ప్రతిభ దాగుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. 2013లో బాలీవుడ్ అభిమానులను ఉర్రూతలూగించిన సినిమా 'ఆషికీ-2'లో కష్టమైన పాటను సింపుల్ గా పాడేసింది. శ్రేయ ఘోషల్ పాడిన 'సున్ రహా హే నా తూ' అంటూ సాగే ఈ పాటలో ఆరోహణ, అవరోహణలు, గమకాలు నిత్యం సంగీత సాధన చేసే వారికి కూడా కష్ట సాధ్యమైనవి. అలాంటి పాటను తుంపాకుమారి సింపుల్ గా క్లాస్ రూంలో సహచరులందరి మధ్య పాడేసి అభినందనలు అందుకుంటోంది. సోషల్ మీడియా వాట్సప్ లలో ఈ వీడియో గురించి నెటిజన్ల వ్యాఖ్య ఎలా ఉందంటే...'పనిలో ఉన్నారా? అయితే ఆపేయండి, ఈ చిన్నారి టాలెంట్ ఓ సారి చూడండి' అంటూ షేర్ చేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News