: ఎన్డీయేలో చేరనున్న పప్పూ యాదవ్


బీహార్ లో ఆర్జేడీ బహిష్కృత నేత పప్పూ యాదవ్ ఎన్డీయేలో చేరనున్నారు. బీహార్ లో అధికారపీఠం చేజిక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్న బీజేపీతో పొత్తుపెట్టుకోవడం ద్వారా, తనను బహిష్కరించిన ఆర్జేడీని దెబ్బకొట్టాలని పప్పూ యాదవ్ భావిస్తున్నారు. కాగా, పలు ఘటనల్లో తీవ్ర ఆరోపణలున్న కారణంగా పప్పూ యాదవ్ ను ఆర్జేడీ నుంచి లాలూప్రసాద్ యాదవ్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. బహిష్కరణకు గురైన అనంతరం పప్పూ యాదవ్ కొత్త పార్టీని స్థాపించారు. ఎన్డీయేతో పొత్తు పెట్టుకుని 20 సీట్లు డిమాండ్ చేసి 'కోసి' ప్రాంతంలో జనతా పరివార్ ను దెబ్బతీయాలని పప్పూ యాదవ్ భావిస్తున్నారు. బీహార్ లో బీజేపీని ఓడించేందుకు అధికార పార్టీ, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని జనతాపరివార్ గా ఏర్పడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News