: పవన్ వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన పనిలేదు: కేటీఆర్


నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు స్పందించారు. పవన్ కల్యాణ్ మాటలు ఏడాదికి ఓసారి వచ్చే సినిమాలో డైలాగుల వంటివని, అతని మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదని అన్నారు. ఎప్పుడో ఓసారి మీడియా ముందుకు వచ్చి పవన్ చేసే వ్యాఖ్యలకి ఏమంత విలువ ఉండదని అభిప్రాయపడ్డారు. వాటిని పట్టించుకుంటే టైమ్ వేస్ట్ అని అన్నారు. అంతకుముందు, పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో చాలా ఆచితూచి మాట్లాడినట్టు అర్థమవుతోంది. సెక్షన్ 8 అమలుకు వ్యతిరేకమంటూనే, దాని అమలు బాధ్యతలు కేంద్రానికి అప్పగించరాదని, సీఎం కేసీఆరే సెక్షన్ 8 అమలు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. రేవంత్ వ్యవహారం కోర్టులో ఉన్నందున ఎక్కువ మాట్లాడలేనని తెలిపారు. మీడియాకు సంకెళ్లా? అని ప్రశ్నించిన ఆయన, ఏ మీడియా సంస్థలకు సంకెళ్లు పడ్డాయో తెలిపేందుకు ఇష్టపడలేదు. మీడియాకు స్వీయ నియంత్రణ అవసరమంటూ ప్రవచించారు.

  • Loading...

More Telugu News