: మహిళా క్రికెట్ లో రికార్డు సృష్టించిన మిథాలీ రాజ్
భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్ తో జరిగిన వన్డేలో 81 పరుగులు సాధించడం ద్వారా భారత్ కు విజయాన్ని కట్టబెట్టిన మిథాలీ, 5 వేల పరుగులు సాధించిన తొలి భారతీయ మహిళా క్రికెటర్ గా నిలిచింది. ప్రపంచ క్రికెట్ లో ఐదు వేల పరుగుల మార్కు సాధించిన రెండో మహిళా క్రికెటర్ గా నిలిచింది. కాగా, ఇంగ్లండ్ కు చెందిన చార్లొట్టె ఎడ్వర్డ్స్ 5,812 పరుగులు సాధించి, ప్రపంచ మహిళా క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డును తన పేరిట లిఖించుకుంది. 1999 నుంచి భారత మహిళా జట్టుకు సేవలందిస్తున్న మిథాలీ రాజ్ ఆల్ రౌండర్ గా రాణిస్తోం.