: అక్కను ఇంటికి పంపిన చెల్లెమ్మ... వింబుల్డన్ లో ఆసక్తికర సమరం


ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో సోమవారం ఆసక్తికర సమరం జరిగింది. మహిళల సింగిల్స్ విభాగంలో విలియమ్స్ సిస్టర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చివరికి చెల్లెలిదే పైచేయిగా నిలిచింది. చెల్లెలు సెరెనా విలియమ్స్ తో ప్రీక్వార్టర్స్ సమరంలో అక్క వీనస్ విలియమ్స్ పెద్దగా పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ లో సెరెనా 6-4, 6-3తో వీనస్ ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పవర్ గేమ్ కు మారుపేరైన విలియమ్స్ సిస్టర్స్ ఈ పోరులోనూ భారీ షాట్లు సంధించారు. అయితే, పదునైన సర్వీసులు, కచ్చితమైన ఏస్ లు కొట్టిన సెరెనా మ్యాచ్ ను కైవసం చేసుకుంది.

  • Loading...

More Telugu News