: 'వ్యాపం' కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదు: రాజ్ నాథ్ సింగ్
'వ్యాపం' కుభకోణంలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, మధ్యప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు 'వ్యాపం' కుంభకోణంపై జరుగుతున్న దర్యాప్తుపై సంతృప్తిగా ఉన్నాయని అన్నారు. దర్యాప్తు సరైన దారిలోనే కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న 'వ్యాపం' కుంభకోణంతో సంబంధమున్న నిందితులు, సాక్షులు 48 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో సీబీఐతో విచారణ జరిపించాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమైంది. దీంతో కేంద్ర మంత్రి స్పందించారు.