: సండ్ర అరెస్టును ఖండిస్తున్నాం: టీటీడీపీ నేత రావుల


ఓటుకు నోటు కేసులో పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టుపై టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఏసీబీ సండ్రను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కావాలనే టీ.టీడీపీ ఎమ్మెల్యేలను కేసులలో ఇరికిస్తోందని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో సండ్ర పేరు లేకపోయినా కక్షపూరితంగా అరెస్ట్ చేశారని విమర్శించారు.

  • Loading...

More Telugu News