: తెలంగాణ ఒక రాష్ట్రం మాత్రమే... ప్రత్యేక దేశం కాదు అన్న సంగతి కేసీఆర్ కు తెలియదా?: పవన్ కల్యాణ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చురకలంటించారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని పొగిడిన పవన్ కల్యాణ్... అదే సమయంలో ఆయన అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. టీడీపీని ఆంధ్ర పార్టీగా అనుక్షణం చెబుతున్న కేసీఆర్... ఆంధ్రలో ఎన్నో పార్టీలున్నాయని, అందులో టీడీపీ కూడా ఒకటన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. తెలంగాణ అన్నది దేశంలో ఉన్న ఎన్నో రాష్ట్రాల్లో ఒకటి మాత్రమే అని... ప్రత్యేక దేశం కాదన్న విషయం కేసీఆర్ కు తెలియదా? అని ప్రశ్నించారు. ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చే విధంగా ఆయన మాట్లాడరాదని సూచించారు.