: బీజేపీ నేతల మెప్పు పొందడానికి ప్రాణహిత-చేవెళ్లను కేసీఆర్ పక్కన పెట్టారు: షబ్బీర్ అలీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ నేతల మెప్పు పొందడానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ను సంతోషపరిచేందుకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కూడా పక్కన పెడుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు సాధ్యం కాకపోతే... గతంలో దీనికి జాతీయ హోదా కావాలని ఎందుకు కోరారని నిలదీశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ కు పేరు వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారని మరో కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి ఆరోపించారు. రూ. 8,500 కోట్లు ఖర్చు చేసిన తర్వాత ఈ ప్రాజెక్టును ఎలా ఆపుతారని ప్రశ్నించారు. తన కుమార్తెకు కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించుకునేందుకే కేసీఆర్ ఈ కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు.