: ఉద్యోగంలో చేరిన ఒబామా కూతురు
అమెరికా అధ్యక్షుడి పెద్ద కుమార్తె మలియా ఉద్యోగంలో చేరింది. ఈ వేసవి సెలవులను ఆ ఉద్యోగంలో గడపనుంది. హెచ్ బీఓ ఛానల్ లో 'గర్ల్స్' అనే కార్యక్రమాన్ని నటి లీనా డన్హామ్ నిర్వహిస్తోంది. మలియాకు కూడా లీనా అన్నా, గర్ల్స్ కార్యక్రమం అన్నా చాలా అభిమానం. దీంతో, లీనా వద్దనే ఆమె తాత్కిలిక ఉద్యోగిగా చేరింది. తన గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సినిమా లేదా టీవీ రంగంలో కొనసాగాలనేది మలియా ఆశయం. గతవారం గర్ల్స్ షూటింగ్ సెట్లో మలియా కనిపించిందని మీడియా వర్గాలు కూడా వెల్లడించాయి.