: మీ శునకానికి జోడీ కావాలా?... ఇదిగో డేటింగ్ యాప్!


స్మార్ట్ ఫోన్లు రంగప్రవేశం చేశాక యువతీయువకుల కోసం ఎన్నెన్ని యాప్ లో. ఒకే విధమైన అభిరుచులు ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ లు ఉన్నాయి. ఇప్పుడు అదే తరహాలో శునకాల కోసం ఓ స్పెషల్ యాప్ రంగప్రవేశం చేయనుంది. ఈ యాప్ ద్వారా మీ పెంపుడు కుక్కలకు తగిన జోడీని ఇట్టే పట్టేయవచ్చు. అంతేగాదు, వాటి సొంతదార్లతో మీరు స్నేహాన్ని కూడా సంపాదించవచ్చు. లండన్ కు చెందిన హోలిడాగ్ అనే సంస్థ ఈ వినూత్న యాప్ ను అభివృద్ధి చేసింది. ఈ డేటింగ్ యాప్ జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ను ఉపయోగించుకుని ఇతర శునకాలను, వాటి యజమానులను గుర్తిస్తుంది. ఈ యాప్ ద్వారా ఒకసారి మ్యాచ్ కుదిరిన తర్వాత, శునకాల సొంతదార్లు ఛాటింగ్ చేయవచ్చు, ఫొటోలు షేర్ చేసుకోవచ్చు, ఇంకా ఆ ప్రాంతంలో ఉన్న ఇతర కుక్కల యజమానులను కూడా కలిసే అవకాశాలు పొందవచ్చు. శునకాలు మానవుడికి విశ్వసనీయ నేస్తాలని, అలాంటి వాటిని ప్రేమించే వ్యక్తులతో సామాజిక సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఇది మంచి వేదిక అని హోలిడాగ్ సంస్థ సీఈఓ జూలియన్ ముల్లర్ తెలిపారు. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ లపై ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News