: ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ


ఈరోజు ముగ్గురు ఐపీఎస్ లను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం, ఆ వెంటనే నలుగురు ఐఏఎస్ లను కూడా బదిలీ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ గా ఉన్న లవ్ అగర్వాల్ ను గృహ నిర్మాణశాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న కరికాల వలెవన్ ను పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్యకు ఆ శాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. ఆర్ఎన్ డీ ముఖ్యకార్యదర్శిగా ఉన్న డి.శ్రీనివాసులను పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News