: ఏసీబీ కార్యాలయంలో కొనసాగుతున్న సండ్ర విచారణ


హైదరాబాద్ లోని ఏసీబీ కార్యాలయంలో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విచారణ కొనసాగుతోంది. ఓటుకు నోటు కేసులో ఆయనను అధికారులు దాదాపు రెండు గంటలకుపైగా విచారిస్తున్నారు. కీలక సమాచారం రాబట్టేందుకు ఈ కేసులో ఆయనకున్న సంబంధంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విచారణ సాయంత్రం వరకు కొనసాగే అవకాశముందని సమాచారం. ఆయనతో పాటు తెలుగు యువత నాయకుడు జిమ్మీబాబుకు కూడా ఏసీబీ అధికారులు నోటీసు పంపగా, ఆయన విచారణకు హాజరుకాలేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News