: వ్యాపమ్ స్కాంపై ప్రధాని మోదీ స్పందించాలి: కేజ్రీవాల్
మధ్యప్రదేశ్ లో కలకలం రేపుతున్న వ్యాపమ్ కుంభకోణంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ విషయంపై ప్రధాని మౌనం వహించకూడదని ట్విట్టర్ లో పేర్కొన్నారు. "వ్యాపమ్ విషయంపై ప్రధాని మాట్లాడాలని, జోక్యం చేసుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. అందుకే ప్రధాని ఇక ఈ విషయంపై మౌనంగా ఉండకూడదు" అని అన్నారు. వ్యాపమ్ స్కాం, ఇందులో చోటుచేసుకున్న అన్ని మరణాలపై పూర్తిగా విచారణ చేయించాలన్నారు. నిందితులకు తప్పనిసరిగా శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఈ స్కాంలో మరణాలను ఆపేందుకు ఏదో ఒకటి చేయాలని కేజ్రీ కోరారు.