: ఆ సమస్యపై చంద్రబాబుతో మాట్లాడతా: పురంధేశ్వరి
అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనాల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఆ సమస్యపై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి స్పందించారు. వేరుశెనగ విత్తనాల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని, ఆయనతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఆమె తెలిపారు. ఈరోజు అనంతపురంలో ఆమె మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా కోసం అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలతో చర్చిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం సుముఖంగా లేకపోయినప్పటికీ... తమ ప్రయత్నాలను మాత్రం కొనసాగిస్తామని తెలిపారు.