: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధకు స్థాన చలనం


ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న అనురాధను విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అడిషనల్ డీజీగా బదిలీ చేశారు. ఇక ఇంటెలిజెన్స్ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు, విజయవాడ సీపీగా గౌతమ్ సావంగ్ నియమితులయ్యారు. ఏపీ సీఎం ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల ఫోన్ లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేయించినట్టు తేలడంతో పలువురు అధికారులపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా అధికారుల బదిలీలు జరిగాయని చెప్పవచ్చు.

  • Loading...

More Telugu News