: ఒక్క సెకనులో 33 హై డెఫినిషన్ సినిమాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు!
సాధారణంగా ఒక హై డెఫినిషన్ సినిమాను డౌన్ లోడ్ చేయాలంటే గంట సమయం పడుతుంది. డౌన్ లోడ్ స్టార్ట్ చేసి, ఏదైనా పని ఉంటే, దాన్ని పూర్తిచేసుకొని కూడా రావచ్చు. అలాంటిది, కేవలం ఒకే ఒక్క సెకనులో 33 హెచ్ డీ సినిమాలను డౌన్ లోడ్ చేస్తే... ఈ ఊహే అద్భుతంగా ఉంది కదూ. త్వరలోనే ఇది నిజం కాబోతోంది. చైనాకు చెందిన ప్రముఖ సంస్థ హువాయి త్వరలోనే కొత్త బ్రాడ్ బ్యాండ్ ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ బ్రాడ్ బ్యాండ్ సహాయంతో సెకనుకు ఒక టెరాబైట్ వేగంతో సమాచార మార్పిడి జరుగుతుంది. దీంతో, చిటికెలో ఎన్నో ఫైల్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.