: చిత్తూరు జిల్లాలో టాస్క్ ఫోర్స్ దాడులు... 10 మంది స్మగ్లర్ల అరెస్టు


చిత్తూరు జిల్లాలో స్మగ్లర్ల కార్యకలాపాలు అధికమవుతుండటంతో టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. తాజాగా స్మగర్ల ఆటకట్టించేందుకు కాణిపాకం, వెదురుకుప్పం పోలీస్ స్టేషన్ల పరిధిలో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో 10 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.20 లక్షల విలువైన 20 ఎర్రచందనం దుంగలు, 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News