: వరంగల్ జిల్లాలో మావోల డంప్... భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం
నిషేధిత మావోయిస్టులకు చెందిన భారీ డంప్ ను తెలంగాణ పోలీసులు గుర్తించారు. వరంగల్ జిల్లా ములుగు మండలం కొడిశలకుంటలో మావోల డంప్ పై విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. డంప్ ను గుర్తించిన పోలీసులు అందులో పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మావోల కార్యకలాపాలు దాదాపుగా కనుమరుగయ్యాయని భావిస్తున్న తరుణంలో ఈ డంప్ లభించడంతో పోలీసు వర్గాలు విస్మయానికి గురవుతున్నాయి.