: రాష్ట్రపతిని కూడా రొచ్చులోకి లాగిన లలిత్ మోదీ
ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ నేతలను తన కుంభకోణంలోకి లాగి పెను సంచలనం సృష్టించిన ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, తాజాగా మరో బాంబు పేల్చారు. ఏకంగా దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా అవినీతి రొచ్చులోకి లాగే ప్రయత్నం చేశారు. గతంలో నాగ్ పాల్ అనే వ్యాపారవేత్త నుంచి ప్రణబ్ దాదా లబ్ధి పొందారని ఆరోపించారు. దీనికి సంబంధించి, నాగ్ పాల్ తో ప్రణబ్ కలసి ఉన్న ఒక ఫొటోను కూడా విడదల చేశారు. ఈ ఆరోపణలపై రాష్ట్రపతి కార్యాలయం భగ్గుమంది. లలిత్ మోదీపై ఢిల్లీ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రపతి గౌరవానికి భంగం వాటిల్లేలా ప్రవర్తించిన మోదీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. దీంతో, ఈ కేసు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఢిల్లీ పోలీసులు దృష్టి సారించారు.