: స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి కన్నుమూత


స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి(89) మృతి చెందారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ఆసుపత్రిలో ఈ ఉదయం కన్నుమూశారు. మే 12, 1926న విజయనగరం జిల్లా ధర్మవరం గ్రామంలో ఆయన జన్మించారు. గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా మూర్తి పనిచేశారు. అలాగే పలు దఫాలుగా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భాట్టం మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News