: భారత్ పై గ్రీస్ సంక్షోభం ఎఫెక్ట్... నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు


ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన గ్రీస్ ప్రభావం భారత మార్కెట్లపైనా కనిపిస్తోంది. గ్రీస్ సంక్షోభం ప్రభావం కారణంగా కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 90 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలకు గ్రీస్ ప్రజలు ససేమిరా అనడంతో నేటి ఉదయం నుంచి పలు దేశాల మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. గ్రీస్ ఆర్థిక సంక్షోభం ప్రధానంగా యూరోపియన్ యూనియన్ దేశాలపై పెను ప్రభావం చూపనుందన్న భయాందోళనలు నెలకొన్నాయి. అదే సమయంలో గ్రీస్ లో కూడా ఆర్థిక పరిస్థితులు మరింత విషమించే ప్రమాదం లేకపోలేదు.

  • Loading...

More Telugu News