: మంచం పట్టిన ‘మాజేరు’... కృష్ణా జిల్లాలో ప్రబలిన విష జ్వరాలు


కృష్ణా జిల్లాలో విష జ్వరాలు ప్రబలాయి. జిల్లాలోని ఘంటసాల మండలం మాజేరు గ్రామంలో దాదాపు 600 మందికి పైగా విష జ్వరాల బారినపడ్డారు. గ్రామంలోని ప్రతి ఇంటిలో విష జ్వర బాధితులున్నారు. సమాచారం తెలుసుకున్న వైద్య, ఆరోగ్య శాఖ తక్షణ చర్యలకు రంగంలోకి దిగింది. గ్రామంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన వైద్యులు, పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. పరిస్థితిని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమీక్షించారు. బాధితులకు అన్ని రకాల చికిత్సలు చేయడంతో పాటు విష జ్వరాలకు కళ్లెం వేయాలని ఆయన వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News