: కాల్పుల విరమణకు పాక్ తూట్లు...బీఎస్ఎఫ్ ఔట్ పోస్టులపై కాల్పులు, జవాను మృతి


భారత్ తో అమలులో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ మరోమారు తూట్లు పొడిచింది. జమ్మూ కాశ్మీర్ లోని సరిహద్దు వెంట ఉన్న ఆర్నియా, నౌగామ్ సెక్టార్లలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ఔట్ పోస్టులపై పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నౌగామ్ సెక్టార్ కు చెందిన ఓ భారత సైనికుడు మృతి చెందాడు. ఇప్పటికే పలుమార్లు కాల్పుల విరమణకు తూట్లు పొడిచిన పాక్ సైన్యం పదుల సంఖ్యలో భారత సైనికులను పొట్టనబెట్టుకుంది. ఇటీవలి కాలంలో పాక్ దుశ్చర్యలకు దీటుగానే సమాధానం చెబుతున్న భారత సైన్యం, తాజా కాల్పులకు కూడా గట్టిగానే బదులిచ్చింది.

  • Loading...

More Telugu News