: ఆహా... ఏమి రుచి!: ‘గుట్ట’ కట్టె పొంగలికి వీరాభిమానిగా మారిన రాష్ట్రపతి ప్రణబ్


పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయం ప్రాశస్త్యం, స్వామి వారి ప్రసాదంపై భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న మధ్యాహ్నం ఆలయ సందర్శనకు వచ్చిన ప్రణబ్, అక్కడి నుంచి వెళ్లేదాకా ఆలయ అభివృద్ధి, స్వామి వారి ప్రసాదాలపై ఆసక్తి కనబరిచారు. ప్రత్యేకించి కట్టె పొంగలిపై ప్రణబ్ మక్కువ చూపారు. ప్రణబ్ రాక నేపథ్యంలో ఆలయ అధికారులు ఎనిమిది రకాల ప్రసాదాలను తయారు చేశారు. వీటిలో కట్టె పొంగలిని మాత్రం రుచి చూసిన ప్రణబ్, ఆ రుచికి మైమరచిపోయారట. ఇలాంటి వంటకం తానెప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించిన ఆయన, ఏఏ పదార్థాలతో ఈ పొంగలిని తయారు చేస్తారంటూ ఆరా తీశారు. దాదాపుగా 5 నిమిషాల పాటు ఆయన కట్టె పొంగలి గురించే ఆలయ అధికారులతో మాట్లాడారట. అంతేకాక కట్టె పొంగలిని తయారు చేయించిన అధికారులతో పాటు పొంగలి తయారు చేసిన వంట స్వాములను కూడా ప్రణబ్ ప్రత్యేకంగా అభినందించారు.

  • Loading...

More Telugu News