: జాన్ అబ్రహాంకు 15కోట్ల ఆఫర్!


బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం బడా రెమ్యునరేషన్ కొట్టేశాడు. ఓ చిత్రంలో నటించేందుకు గానూ 15 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నట్లు సమాచారం. త్వరలో హిందీలో 'వెల్ కమ్' చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. దీనిని అనీస్ బజ్మీ దర్శకత్వంలో ఏ. నడియడ్ వాలా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోగా నటిస్తున్నందుకు గాను ఈ హ్యాండ్ సమ్ హీరోకు ఇంత పారితోషికాన్ని ఇస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. గతంలో వచ్చిన 'వెల్ కమ్' లో నటుడు అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించగా, భారీ విజయాన్ని సాధించింది.

  • Loading...

More Telugu News