: నా పాటను మికా సింగ్ దొంగిలించాడు: సల్మాన్ ఖాన్


తన పాటను సింగర్ మికా సింగ్ దొంగిలించాడని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆరోపించాడు. 'భజరంగీ భాయ్ జాన్' సినిమాతో సల్లూ భాయ్ ఈ నెల 17న అభిమానుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'ఆజ్ కీ పార్టీ' అనే పాటను సల్మాన్ ఖాన్ పాడాలనుకున్నాడట. పాటను పాడదామని నిర్ణయించుకుని, సల్మాన్ కి అనువుగా పాట లెంగ్త్ కూడా తగ్గించారట. ఇంతలోనే ఈ పాటను మికా సింగ్ పాడేశాడట. దీనినే సల్మాన్ అలా చమత్కరించాడు. నిన్న విడుదలైన ఈ పాట అభిమానులను అలరిస్తోంది. కాగా, 'భజరంగీ భాయ్ జాన్' సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు సల్మాన్ దూరంగా ఉండనున్నాడు. 'హిట్ అండ్ రన్' కేసులో బెయిల్ పై విడుదలైన సల్మాన్ ముంబై దాటాలంటే న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీంతో, ప్రమోషన్ కి న్యాయస్థానం అనుమతి నిరాకరించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు సలహా ఇవ్వడంతో, ఎందుకీ తలనొప్పి అని భావించి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రమోషన్ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నాడు.

  • Loading...

More Telugu News