: జపాన్ చేరుకున్న చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జపాన్ చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి హైదరాబాదు నుంచి బయల్దేరిన చంద్రబాబు బృందం, హాంగ్ కాంగ్ మీదుగా జపాన్ చేరుకుంది. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటనలో బాబు, పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఎంత అనుకూలమో వారికి వివరించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని 'అమరావతి' శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా జపాన్ ప్రధాని షింజో అబెను ఆహ్వానించనున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు జపాన్ లోనే పర్యటించనున్న బాబు బృందం, 9, 10 తేదీలలో చైనాలో పర్యటించనుంది. 10న హైదరాబాదుకు తిరుగుపయనమవనున్నారు.

  • Loading...

More Telugu News