: చిచ్చుపెట్టేవాళ్లకు బుద్ధి చెప్పండి: 'తానా' వేడుకల్లో ఎర్రబెల్లి
తెలుగు ప్రజలంతా ఒక్కటేనని సమైక్యతను చాటిన తానాకు అభినందనలని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. అమెరికాలోని డెట్రాయిట్ లో జరిగిన తానా వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఐకమత్యంగా ఉండాలని సూచించారు. తెలుగు రాష్ట్రాలు వేరైనా భాష ఒక్కటేనని, భాష తెలుగు ప్రజలను కలిపి ఉంచుతుందని ఆయన తెలిపారు. కొంత మంది తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని, అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు. ఆయా ప్రాంతాలకు చెందిన తెలుగు సంస్కృతిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. తానా సభల్లో పాల్గొన్న మేధావులందరికీ ధన్యవాదాలని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రాల మధ్య నెలకొన్న పరిస్థితులను చూసి ఆందోళన చెందవద్దని, అన్నీ కుదురుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.