: ఆ సివిల్స్ విజేతను ఓ 'బర్రె' చదివించింది!


సివిల్స్ ర్యాంకర్లది ఒక్కొక్కరిది ఒక్కో విజయగాథ. తమిళనాడుకు చెందిన 'వన్మతి'ది మాత్రం స్పూర్తిదాయకమైన గాథ. తమిళనాడు ఈరోడ్ జిల్లా సత్యవేడుకు చెందిన వన్మతి తండ్రి చెన్నియప్పన్ అద్దె ట్యాక్సీ నడుపుతాడు. తల్లి సుబ్బులక్ష్మి చిన్నచిన్న పనులు చేస్తుంది. కుమార్తె చదువు భారం కాకూడదనే ఉద్దేశ్యంతో వన్మతి పేరిట ఓ బర్రెను కొన్నారు. దానిని వన్మతి స్కూలుకు వెళ్లేటప్పుడు తోలుకెళ్లి, పచ్చికబయళ్లలో వదిలేసేది. స్కూలు అయిపోయాక దానిని ఇంటికి తోలుకొచ్చేది. దాని పాలే వన్మతి చదువుకయ్యే ఖర్చును భరించేవి. పెద్దయ్యాక కూడా వన్మతి బర్రెను వదల్లేదు. చదువుకుంటూనే దానిని మేపేది. అలా 2011లో తొలిసారి సివిల్స్ రాసినా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యింది. 2012లో కనీసం ప్రిలిమ్స్ పాస్ కాలేదు. 2013లో మెయిన్స్ లో విజయం సాధించలేదు. 2014లో కష్టపడి 152వ ర్యాంకు సాధించింది. దీంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుందన్న ఆనందంలో ఉన్న వన్మతి, తనకెంతో ఇష్టమైన బర్రెను వదిలి ఉండాలంటే కష్టంగా ఉందని పేర్కొంది. ఆ బర్రె తమ కుటుంబానికి ఆదాయ వనరు కాదని, కుటుంబ సభ్యురాలని వన్మతి పేర్కొంటోంది.

  • Loading...

More Telugu News