: ఏయ్... అరవకు పిచ్చోడిలా!: రైతుపై కేసీఆర్ ఆగ్రహం


కరీంనగర్ జిల్లా హుస్నాబాదులో నిన్న జరిగిన బహిరంగ సభలో జనం సాక్షిగా కేసీఆర్ ఓ రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నన్నే ప్రశ్నిస్తావా?' అంటూ గదమాయించారు. బుద్దుందా? అంటూ చీవాట్లు పెట్టారు. సభలో కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ఒగులాపూర్ కు చెందిన రైతు ముస్కు మహిపాల్ రెడ్డి ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. ‘‘తోటపల్లి రిజర్వాయర్ ను రద్దు చేశారు. నీరెలా తెస్తారు?’’ అంటూ మహిపాల్ రెడ్డి కేసీఆర్ ను ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన కేసీఆర్ ‘‘ఏయ్.. అరవకు.. పిచ్చోడిలా.. నీకే బాగా తెలుసా?.. నాకు తెలవదా?.. నాకన్నా నీకే ఎక్కువ తెలుసా?.. తోటపల్లి రిజర్వాయర్ కడితే నీరు తెస్తావా?.. నాకే అడ్డం మాట్లాడతావా?.. బుద్దుందా?, లేదా?.. అడిగేందుకు అక్కడొకడు, ఇక్కడొకడు తయారైండు.. వినే తెలివి ఉండాలి’’ అంటూ అంతెత్తున ఎగిరిపడ్డారు. అనంతరం కాస్త సర్దుకున్న కేసీఆర్, మహిపాల్ రెడ్డిని అక్కడినుంచి తరలించేందుకు సిద్ధమైన పోలీసులను వారించి, అతడిని అక్కడే ఉండనీయండంటూ ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News