: బాబోయ్... నేను పార్టీ మారట్లేదు: దానం నాగేందర్
హస్తాన్ని వీడి కారెక్కుతారన్న వదంతులను కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ మరోమారు ఖండించారు. ఇప్పటికే ఈ వదంతులపై స్పందించిన ఆయన కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని విస్పష్టంగా ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా నగరంలో మంచి పట్టున్న దానం నాగేందర్ ను టీఆర్ఎస్ లాగేసుకుంటుందన్న పుకార్లు ఇటీవల జోరందుకున్నాయి. అయితే ఆ వదంతుల్లో ఎలాంటి వాస్తవం లేదని దానం కొట్టిపారేశారు. తాజాగా నేటి ఉదయం మీడియాతో మాట్లాడిన సందర్భంగానూ దానం ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. పార్టీ మారట్లేదని విస్పష్టంగా ప్రకటించినా, ఇవేం ప్రశ్నలంటూ ఆయన మీడియా ప్రతినిధులపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు.