: ఓటుకు నోటు ‘జిమ్మీ’ కూడా టీడీపీ నేతేనట...హెచ్ సీఏ కో-ఆర్డినేటర్ గానూ వ్యవహరిస్తున్నారట


తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టిన ఓటుకు నోటు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు ఏసీబీ నోటీసులు అందుకున్న జిమ్మీబాబు కూడా టీడీపీ నేతనేనట. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన జిమ్మీబాబు టీడీపీ యూత్ వింగ్ ‘తెలుగు యువత’ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడట. ఈ క్రమంలోనే అతడికి టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డితో పరిచయమైందని తెలుస్తోంది. కేసులో కీలక వ్యక్తి, తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ కు సెబాస్టియన్ ను పరిచయం చేసింది కూడా జిమ్మీనేనట. ఈ క్రమంలో రేపటి ఏసీబీ విచారణలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూసే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా ఉన్న జిమ్మీబాబు హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్(హెచ్ సీఏ) కో-ఆర్డినేటర్ గానూ వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News