: తిరుమలకు పోటెత్తిన భక్తులు... వైకుంఠం కాంప్లెక్స్ ముందు 2 కి.మీల క్యూ
వెంకన్న సన్నిధి తిరుమలకు భక్తులు పోటెత్తారు. నిన్న రాత్రి నుంచి మొదలైన భక్తుల రాక నేటి ఉదయం దాకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం తిరుమల భక్తులతో కిక్కిరిసిపోయింది. సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో స్వామి వారి దర్శనం కోసం సర్వదర్శనం భక్తులు 15 గంటల పాటు వేచి చూడాల్సి వస్తోంది. ఇక కాలినడక భక్తులకు స్వామి వారి దర్శనం 8 గంటలకు లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ముందు రెండు కిలో మీటర్ల మేర భక్తులు బారులు తీరారు.