: హైదరాబాదు సీసీఎస్ లో ‘అవుట్ లుక్’పై కేసు నమోదు
తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ ను కించపరిచేలా కథనం, వ్యంగ్య చిత్రం ప్రదర్శించిన విషయంలో జాతీయ ఆంగ్ల మేగజీన్ ‘అవుట్ లుక్’పై హైదరాబాదులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. స్మితా సభర్వాల్ భర్త, ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ నిన్న సీసీఎస్ పోలీసులకు ‘అవుట్ లుక్’పై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అవుట్ లుక్ మేగజీన్ ఎడిటర్ ఇన్ చీఫ్ కృష్ణప్రసాద్, అసిస్టెంట్ ఎడిటర్ మాధవీ టాటా, కార్టూనిస్ట్ షాహిల్, మేగజీన్ ప్రతినిధి ఇంద్రాణిరాయ్ తదితరులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.