: రాహుల్ గాంధీ కూడా నా ఆతిథ్యం స్వీకరించారు: మరో బాంబు పేల్చిన లలిత్ మోదీ


ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ మరో బాంబు పేల్చాడు. అటు అధికార పార్టీ బీజేపీనే కాక, ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా ఇరుకునపెట్టేలా ఇప్పటికే పలు సంచలన ప్రకటనలు చేసిన లలిత్ మోదీ, తాజాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని టార్గెట్ చేశాడు. రాహుల్ గాంధీ కూడా తన ఆతిథ్యం స్వీకరించారని అతడు నిన్న ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అంతేకాక తన ప్రకటన సత్యమేనని చెప్పేందుకు రాహుల్ గాంధీకి అతడిచ్చిన ఆతిథ్యానికి సంబంధించిన ఫొటోను కూడా అందులో పోస్ట్ చేశాడు. ‘‘ఈ ఫొటో చూశాక, తన ఆతిథ్యం స్వీకరించలేదని రాహుల్ గాంధీ గాని, రాబర్ట్ వాద్రా కాని చెప్పగలరా?’’ అంటూ మోదీ సవాల్ చేశాడు.

  • Loading...

More Telugu News