: ‘టన్నులు’ అంటే డబ్బులేనట!... జగన్ కేసులో కోర్టుకు చెప్పిన సీబీఐ


టన్ను అంటే... బరువును సూచించే ప్రమాణం. సిమెంట్, స్టీలుతో పాటు ధాన్యం తదితరాలను టన్నుల్లోనే కొలుస్తాం. కానీ ఈ పదాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆడిటర్ గానే కాక, తాజాగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన విజయసాయిరెడ్డి డబ్బులకు ‘కోడ్’ పదంగా వినియోగించారట. ఈ మేరకు సీబీఐ అధికారులు నిన్న జగన్ అక్రమాస్తుల కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టుకు తెలిపారు. దాల్మియా సిమెంట్స్ ప్రతినిధులతో ఈ మెయిళ్ల ద్వారా జరిపిన సంప్రదింపుల్లో విజయసాయి రెడ్డి డబ్బులకు కోడ్ గా ఈ పదాన్నే వాడారట. ‘‘3,500 టన్నుల స్టాక్ అందింది. మరో 500 టన్నుల స్టాక్ పంపండి’’ అంటూ సాయిరెడ్డి దాల్మియా సిమెంట్ ప్రతినిధులకు మెయిల్ పంపారట. దాల్మియా సిమెంట్స్ కు చెందిన జోయ్ దీప్ బసు అనే వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ లోని సమాచారాన్ని విశ్లేషించిన సీబీఐ అధికారులకు ఈ ‘మెయిల్’ కనిపించింది. సదరు మెయిల్ పంపిన సమయంలో సాయిరెడ్డి దాల్మియా సిమెంట్స్ నుంచి సిమెంట్ కానీ, స్టీలు కాని కొనుగోలు చేయలేదట. దీంతో ‘టన్ను’ అనే పదాన్ని డబ్బుకు కోడ్ గానే సాయిరెడ్డి వాడారని సీబీఐ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయాన్ని నిన్న కోర్టుకు చెప్పారు.

  • Loading...

More Telugu News