: తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేయండి...నాట్స్ సభ్యులకు బాలయ్య పిలుపు


అమెరికాలో తెలుగు ప్రజల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాట్స్) సదస్సుకు టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీసమేతంగా హారజయ్యారు. నిన్నటి సమావేశాల్లో భాగంగా ఆయన ప్రసంగం అక్కడి తెలుగు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. తరతరాల చరిత్ర కలిగిన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటాలని ఆయన నాట్స్ సభ్యులకు పిలుపునిచ్చారు. తెలుగు భాష తియ్యదనాన్ని ప్రపంచ ప్రజలు గుర్తించేలా చేయాలని కూడా బాలయ్య కోరారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణమని, దీనిని ప్రవాసాంధ్రులు సద్వినియోగం చేసుకోవాలని కూడా బాలయ్య సూచించారు.

  • Loading...

More Telugu News