: కరెంటు బిల్లు 75 కోట్లు...షాక్ తిన్న వినియోగదారుడు
హర్యానాలోని గుర్ గావ్ లో విద్యుత్ శాఖాధికారులు జితేంద్ర కుమార్ అనే వినియోగదారుడికి రెండు నెలలకు 75 కోట్ల రూపాయల బిల్లు ఇచ్చి షాకిచ్చారు. దీనిపై అతను మాట్లాడుతూ, తన ఇంటి ధర కూడా అంత ఉండదని పేర్కొన్నాడు. తనది డొమెస్టిక్ కనెక్షన్ అని చెప్పిన ఆయన, సాధారణంగా తనకు 5 వేల నుంచి 9 వేల మధ్యలో విద్యుత్ బిల్లు వస్తుంటుందని అన్నాడు. అలాంటిది ఈసారి ఏకంగా 75 కోట్ల రూపాయల బిల్లు వేశారని తెలిపాడు. దీనిపై విద్యుత్ బిల్లు జారీ చేసిన వ్యక్తికి, విద్యుత్ శాఖాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, ఎవరూ స్పందించడం లేదని వాపోయాడు.