: రబ్బరు టబ్బుతోపాటు సముద్రంలోకి కొట్టుకుపోయిన పదినెలల చిన్నారి... రక్షించిన మెరైన్ పోలీసులు


రబ్బరు టబ్బుతోపాటు పదినెలల చిన్నారి సముద్రంలోకి కొట్టుకుపోయిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. విహారానికి సముద్రపు ఒడ్డుకు వెళ్లిన చిన్నారి కుటుంబ సభ్యులు, రబ్బరు టబ్ లో చిన్నారిని పడుకోబెట్టి నీళ్లలో ఆడుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో చిన్నారిని మర్చిపోయారు. వారు ఆట సందడిలో ఉండగా, సముద్రపు అలలు చిన్నారిని నెమ్మదిగా నీళ్లలోకి లాక్కెళ్లిపోయాయి. రబ్బరు టబ్ దూరంగా వెళ్లిపోయాక చూసిన ఇతరులు చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే అది దూరంగా వెళ్లిపోవడంతో దాని దగ్గరకు వెళ్లలేకపోయారు. దీంతో వారు స్థానిక మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. విశేషం ఏమిటంటే, పోలీసులు రంగ ప్రవేశం చేసినంత వరకు చిన్నారి కుటుంబ సభ్యులకు అసలు విషయం తెలియదట. కిలో మీటర్ దూరం వెళ్లిపోయిన చిన్నారి వద్దకు వెళ్లిన మెరైన్ పోలీసులు, రక్షించి కుటుంబ సభ్యులకు క్షేమంగా అందజేశారు.

  • Loading...

More Telugu News