: తూచ్...పెళ్లికి ఓకే కాదు...ప్రేమకే!: సల్మాన్ ఖాన్


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చెప్పే మాటలు, చేసే చేష్టలు అన్నీ విస్తుగొలిపేలా ఉంటాయి. షాహిద్ కపూర్ కూడా పెళ్లి చేసుకుంటున్నాడు, మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారని అడగడంతో, పెద్దలు కుదిర్చిన సంబంధమైతే పెళ్లికి సిద్ధమని చెప్పిన సంగతి తెలిసిందే. రెండు రోజులు కూడా తిరక్కుండానే సల్మాన్ మాట మార్చేశాడు. 'భజరంగీ భాయ్ జాన్' సినిమాలోని ఈద్ పాటను విడుదల చేసిన సందర్భంగా, పెద్దలు ఎలాంటి అమ్మాయిని చూడాలని సల్లూ భాయ్ ని ప్రశ్నించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని అన్నాడు. పెళ్లి క్యాన్సిల్ అని, ప్రేమలోకి తిరిగి వచ్చేశానని సల్మాన్ చెప్పాడు. బాలీవుడ్ లో 49 ఏళ్ల సల్మాన్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్!

  • Loading...

More Telugu News